ఓ పాపా లాలి.. జన్మకే లాలి.. (గీతాంజలి 1989)

24 మే

ఓ పాపా లాలి.. జన్మకే లాలి.. ప్రేమకే లాలి.. పాడనా తీయగా..

ఓ పాపా లాలి.. జన్మకే లాలి.. ప్రేమకే లాలి .. పాడనా….

ఓ పాపా లాలి..


నా.. జోలలా లీలగా తాకాలని, గాలినే కోరనా జాలిగా..
నీ.. సవ్వడే సన్నగా ఉండాలని, కోరనా గుండెనే కోరిక..
కలలారని పసిపాప, తలవాల్చిన ఒడిలో..
తడి నీడలు పడనీకే, ఈ దేవత గుడిలో..
చిరు చేపల కనుపాపలకిది నా మనవి..

ఓ పాపా లాలి.. జన్మకే లాలి.. ప్రేమకే లాలి.. పాడనా తీయగా..

ఓ పాపా లాలి..


ఓ.. మేఘమా ఉరమకే ఈ పూటకి, గాలిలో తేలిపో వెళ్ళిపో..
ఓ.. కోయిలా పాడవే నా పాటని, తీయని తేనెలే చల్లిపో..
ఇరు సంధ్యలు కదలాడే, ఎద ఊయల ఒడిలో..
సెలయేరుల అల పాటే, వినిపించని గదిలో..
చలి ఎండకు సిరి వెన్నెలకిది నా మనవి..

… ఓ పాపా లాలి.. జన్మకే లాలి.. ప్రేమకే లాలి.. పాడనా తీయగా..

ఓ పాపా లాలి.. జన్మకే లాలి.. ప్రేమకే లాలి .. పాడనా….

ఓ పాపా లాలి….


సాహిత్యం: వేటూరి

సంగీతం: ఇళయరాజా

గానం: S.P. బాలు

చిత్రం: గీతాంజలి

దర్శకత్వం: మణిరత్నం


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: