శ్రీవారికి ప్రేమలేఖ – తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు

11 మార్చి

శ్రీమన్-మహారాజా మార్తాండ తేజా… ప్రియానందభోజా..
మీ శ్రీచరణాంభోజములకు.. ప్రేమతో నమస్కరించి…
మిము వరించి… మీ గురించి… ఎన్నో కలలు గన్న కన్నె బంగారు..
భయముతో .. భక్తితో… అనురక్తితో… శాయంగల విన్నపములు…

సంధ్యారాగం చంద్రహారతి పడుతున్నవేళ… మసకచీకటి మధ్యమావతి పాడుతున్నవేళ… ఒక శుభముహూర్తాన..

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు… కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కథలు… ఎన్నెన్నొ కథలు..
జో అచ్యుతానంద.. జో జో ముకుందా…
లాలి పరమానంద రామగోవింద… జో… జో…..
నిదురపోని కనుపాపలకు జోల పాడలేక…
“”… “” …. ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక…
ఇన్నాళ్లకు రాస్తున్న… ఊహు..హు..హు… ప్రేమలేఖ..

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు… కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కథలు… ఎన్నెన్నొ కథలు..

ఏతల్లి కుమారులో తెలియదుగానీ… ఎంతటి సుకుమారులో తెలుసునాకు..
ఎంతటి మగధీరులో తెలియలేదు గానీ… నా మనసుని దోచిన చోరులు మీరు..
వలచి వచ్చిన వనితను చులకన చేయక..
తప్పులుంటె మన్నించి.. ఒప్పులుగా భావించి… చప్పున బదులివ్వండి… చప్పున… బదులివ్వండి..

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు… కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కథలు… ఎన్నెన్నొ కథలు..

తలలోన తురుముకున్న తుంటరిమల్లే తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే… ఆ…. అబ్బ…..
సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మళ్లే నా ఓర్పు నిట్టూర్పుకి జాబిలి వాడె… ఆ…. ఆ..
మీ జతనే కోరుకొని లతలాగా అల్లుకుని…
నాకు మీరు మనసిస్తే.. ఇచ్చినట్టు మాటిస్తే… ఇప్పుడే బదులివ్వండి… ఇప్పుడే…. బదులివ్వండి..

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు… కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కథలు… ఎన్నెన్నొ కథలు..

 

ఒక స్పందన to “శ్రీవారికి ప్రేమలేఖ – తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు”

  1. smspostbox ఆగస్ట్ 16, 2012 వద్ద 1:34 సా. #

    very very nice….

వ్యాఖ్యానించండి