సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి

13 జన

———————————————-

హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా

హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా

———————————————-

సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి

నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి

మళ్లీ జనమంటూ ఉంటే సూరమ్మో ఓ…ఓ…ఓ…

తల్లీ నీ కడుపున బుడతా మాయమ్మా..

తల్లీ నీ కడుపున బుడతా మాయమ్మా….

సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి

నవ్వుల్లో నాగామల్లి నాపల్లె పాలవెల్లి

———————————————-

తొలికోడి కూయంగా తెలతెల్లా వారంగా

పాలు కడవల్లు నిండా పల్లే బంగారు కొండా

పారుతున్నా యేరు పచ్చాపచ్చాని పైరు

ముత్యాల ముగ్గుల్లో సిగ్గులొలికే పల్లె

సంక్రాంతి సంబరాలు సూరమ్మో ఓ…ఓ…ఓ…

అంబరాన్ని తాకే సూడమ్మో

అంబరాన్ని తాకే సూడమ్మో

సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి

నవ్వుల్లో నాగామల్లి నాపల్లె పాలవెల్లి

———————————————-

పుండ్లున్నా సుండ్రున్నా చీదరించాకుండా

ఊడిగమెంతో జేసే మాయన్నా మంగాలన్న

పల్లెంతా మైలాదీసి మల్లే పువ్వుగా జేసి

ఓహోం ఓహో అంటూ పల్లాకీ మోతైనావు

మాడేలును మదిలో తలసి ఓరన్నో ఓ…ఓ…ఓ…

ఊరికి దివిటైనావా మాయన్నా.. నువ్వూ

ఊరికి దివిటైనావా మాయన్నా

సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి

నవ్వుల్లో నాగామల్లి నాపల్లె పాలవెల్లి

———————————————-

జాజిరి జాజి  జాజిరి జాజి జాజిరి జాజి హోయ్..

జాజిరి జాజి  జాజిరి జాజి జాజిరి జాజి హోయ్…

———————————————-

మట్టిని ముద్దాజేసి మా కూటికి కుండైనావా

గౌడన్నా తాళ్లుగీసి పల్లెంతా కల్లుబోసి

పొద్దంతా బట్టనేయా గుండే దారాపు కండే

ఆరు గజాల చీర అగ్గిపెట్టెల్లో బెట్టే

చేతి కులవృత్తూలకు ఓరన్నో ఓ….ఓ…ఓ…

చెయ్యెత్తి దండం బెడతా సాలన్న

చెయ్యెత్తి దండం బెడతా సాలన్న

సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి

నవ్వుల్లో నాగామల్లి నాపల్లె పాలవెల్లి

———————————————-

అల్లల్ల నేరళ్ల గొళ్లా కురుమాల మంద

ఊరు మేలు గోరే భీరన్న దండాలన్న

పొట్టా గాలి తిత్తి పొద్దంతా ఒత్తి ఒత్తి

కొడవల్లకు కత్తయినావు నాగళ్ళ కర్రయినావు

కమ్మారి కొలిమైనావా ఓరన్నో ఓ…ఓ…ఓ…

మా ఊరికి చెలిమైనావా మాయన్నా

మా ఊరికి చెలిమైనావా మాయన్నా

సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి

నవ్వుల్లో నాగామల్లి నాపల్లె పాలవెల్లి

———————————————-

కాళ్లాకి చెప్పయినావు దండోరా డప్పయినావు

పల్లెకు చివరానుంటూ ఊరీకే కాపైనావు

ఎండవానల్లో నీవే సేనూ సెలకల్లో నీవే…

అయ్యారే మాలన్నా అన్నీ పనులల్లో నీవే

సరిరారు నీకెవరూ ఓరన్నో ఓ…ఓ…ఓ….

సల్లంగా ఉండాలి మాయన్నా.. నువ్వూ

సల్లంగా ఉండాలి మాయన్నా

సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి

నవ్వుల్లో నాగామల్లి నాపల్లె పాలవెల్లి

———————————————-

ఓ…ఓ….ఓ..    ఓ…ఓ….ఓ…

ఓ…ఓ….ఓ..    ఓ…ఓ….ఓ…

———————————————-

రచన: అందెశ్రీ

గానం: రమణ

చిత్రం: ఊరుమనదిరా

సంగీతం: కోటి

గమనిక: ఏవైనా తప్పులు దొర్లినట్లైతే క్రింద వ్యాఖ్యానించండి. సరిచెయగలను. ధన్యవాదములు.

వ్యాఖ్యానించండి