Ruthuragalu – Vasanta Samiramla

11 మార్చి

వాసంత సమీరంలా.. నును వెచ్చని గ్రీష్మంలా… సారంగ సరాగంలా.. అరవిచ్చిన లాస్యంలా…
ఒక శ్రావణ మేఘంలా… ఒక శ్రవణ మేఘంలా… శిరశ్చంద్రికల కలలా…
హేమంత తుషారంలా… నవశిశిర తరంగంలా…
కాలం జాలం లయలో కలల అలల సవ్వడిలో…
కాలం జాలం లయలో కలల అలల సవ్వడిలో…
సాగే జీవనగానం… అణువణువున ఋతురాగం…
సాగే జీవనగానం.. అణువణువున ఋతురాగం…
వాసంత సమీరంలా.. నునువెచ్చని గ్రీష్మంలా… సారంగ సరాగంలా… అరవిచ్చిన లాస్యంలా….

ఓ పాపా లాలి.. జన్మకే లాలి.. (గీతాంజలి 1989)

24 మే

ఓ పాపా లాలి.. జన్మకే లాలి.. ప్రేమకే లాలి.. పాడనా తీయగా..

ఓ పాపా లాలి.. జన్మకే లాలి.. ప్రేమకే లాలి .. పాడనా….

ఓ పాపా లాలి..

నా.. జోలలా లీలగా తాకాలని, గాలినే కోరనా జాలిగా..
నీ.. సవ్వడే సన్నగా ఉండాలని, కోరనా గుండెనే కోరిక..
కలలారని పసిపాప, తలవాల్చిన ఒడిలో..
తడి నీడలు పడనీకే, ఈ దేవత గుడిలో..
చిరు చేపల కనుపాపలకిది నా మనవి..

ఓ పాపా లాలి.. జన్మకే లాలి.. ప్రేమకే లాలి.. పాడనా తీయగా..

ఓ పాపా లాలి..

ఓ.. మేఘమా ఉరమకే ఈ పూటకి, గాలిలో తేలిపో వెళ్ళిపో..
ఓ.. కోయిలా పాడవే నా పాటని, తీయని తేనెలే చల్లిపో..
ఇరు సంధ్యలు కదలాడే, ఎద ఊయల ఒడిలో..
సెలయేరుల అల పాటే, వినిపించని గదిలో..
చలి ఎండకు సిరి వెన్నెలకిది నా మనవి..

… ఓ పాపా లాలి.. జన్మకే లాలి.. ప్రేమకే లాలి.. పాడనా తీయగా..

ఓ పాపా లాలి.. జన్మకే లాలి.. ప్రేమకే లాలి .. పాడనా….

ఓ పాపా లాలి….

సాహిత్యం: వేటూరి

సంగీతం: ఇళయరాజా

గానం: S.P. బాలు

చిత్రం: గీతాంజలి

దర్శకత్వం: మణిరత్నం

వరహ రూపం.. దైవ వరీష్టం..

2 జన

వరాహ రూపం.. దైవ వరీష్టం…
వరాహ రూపం.. దైవ వరీష్టం…
వరస్మిత వదనం
వజ్రదంతధర రక్షా కవచం
శివసంభూత భువి సంజాత
నంభీదవ గింభు కొడువవనీత
సావిరదైవద మనసంప్రీత
భేడుత నిం దేవు ఆరాధిసుత

పాపమగరిస
మాగరిస
మగరిస
గరిస
రిస
సని సరిగమ

పాపమగరిస
మాగరిస
మగరిస
గరిస
రిస
సని సరిగమ

దాద మపద నినిదప దనిసరిగ నిసరిగ రిరిసని దపదనిసరి
దానిసరిగమ సారిగమ పదమా పద నిదమ పద నిదమ గా

( దాద మపదనినిదప దనిసరిగ నిసరిగరిరి సనిదప దనిసరి )
( దాని సరిగమ సారిగమపద మాపద నిదమప దనిదమగా )

సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి

13 జన

———————————————-

హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా

హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా

———————————————-

సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి

నవ్వుల్లో నాగామల్లి నా పల్లె పాలవెల్లి

మళ్లీ జనమంటూ ఉంటే సూరమ్మో ఓ…ఓ…ఓ…

తల్లీ నీ కడుపున బుడతా మాయమ్మా..

తల్లీ నీ కడుపున బుడతా మాయమ్మా….

సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి

నవ్వుల్లో నాగామల్లి నాపల్లె పాలవెల్లి

———————————————-

తొలికోడి కూయంగా తెలతెల్లా వారంగా

పాలు కడవల్లు నిండా పల్లే బంగారు కొండా

పారుతున్నా యేరు పచ్చాపచ్చాని పైరు

ముత్యాల ముగ్గుల్లో సిగ్గులొలికే పల్లె

సంక్రాంతి సంబరాలు సూరమ్మో ఓ…ఓ…ఓ…

అంబరాన్ని తాకే సూడమ్మో

అంబరాన్ని తాకే సూడమ్మో

సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి

నవ్వుల్లో నాగామల్లి నాపల్లె పాలవెల్లి

———————————————-

పుండ్లున్నా సుండ్రున్నా చీదరించాకుండా

ఊడిగమెంతో జేసే మాయన్నా మంగాలన్న

పల్లెంతా మైలాదీసి మల్లే పువ్వుగా జేసి

ఓహోం ఓహో అంటూ పల్లాకీ మోతైనావు

మాడేలును మదిలో తలసి ఓరన్నో ఓ…ఓ…ఓ…

ఊరికి దివిటైనావా మాయన్నా.. నువ్వూ

ఊరికి దివిటైనావా మాయన్నా

సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి

నవ్వుల్లో నాగామల్లి నాపల్లె పాలవెల్లి

———————————————-

జాజిరి జాజి  జాజిరి జాజి జాజిరి జాజి హోయ్..

జాజిరి జాజి  జాజిరి జాజి జాజిరి జాజి హోయ్…

———————————————-

మట్టిని ముద్దాజేసి మా కూటికి కుండైనావా

గౌడన్నా తాళ్లుగీసి పల్లెంతా కల్లుబోసి

పొద్దంతా బట్టనేయా గుండే దారాపు కండే

ఆరు గజాల చీర అగ్గిపెట్టెల్లో బెట్టే

చేతి కులవృత్తూలకు ఓరన్నో ఓ….ఓ…ఓ…

చెయ్యెత్తి దండం బెడతా సాలన్న

చెయ్యెత్తి దండం బెడతా సాలన్న

సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి

నవ్వుల్లో నాగామల్లి నాపల్లె పాలవెల్లి

———————————————-

అల్లల్ల నేరళ్ల గొళ్లా కురుమాల మంద

ఊరు మేలు గోరే భీరన్న దండాలన్న

పొట్టా గాలి తిత్తి పొద్దంతా ఒత్తి ఒత్తి

కొడవల్లకు కత్తయినావు నాగళ్ళ కర్రయినావు

కమ్మారి కొలిమైనావా ఓరన్నో ఓ…ఓ…ఓ…

మా ఊరికి చెలిమైనావా మాయన్నా

మా ఊరికి చెలిమైనావా మాయన్నా

సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి

నవ్వుల్లో నాగామల్లి నాపల్లె పాలవెల్లి

———————————————-

కాళ్లాకి చెప్పయినావు దండోరా డప్పయినావు

పల్లెకు చివరానుంటూ ఊరీకే కాపైనావు

ఎండవానల్లో నీవే సేనూ సెలకల్లో నీవే…

అయ్యారే మాలన్నా అన్నీ పనులల్లో నీవే

సరిరారు నీకెవరూ ఓరన్నో ఓ…ఓ…ఓ….

సల్లంగా ఉండాలి మాయన్నా.. నువ్వూ

సల్లంగా ఉండాలి మాయన్నా

సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి

నవ్వుల్లో నాగామల్లి నాపల్లె పాలవెల్లి

———————————————-

ఓ…ఓ….ఓ..    ఓ…ఓ….ఓ…

ఓ…ఓ….ఓ..    ఓ…ఓ….ఓ…

———————————————-

రచన: అందెశ్రీ

గానం: రమణ

చిత్రం: ఊరుమనదిరా

సంగీతం: కోటి

గమనిక: ఏవైనా తప్పులు దొర్లినట్లైతే క్రింద వ్యాఖ్యానించండి. సరిచెయగలను. ధన్యవాదములు.

అవును నిజం అవును నిజం అవును నిజం నీవన్నది – శ్రీ శ్రీ మహాప్రస్థానం

13 ఏప్రి

అవును నిజం అవును నిజం అవును నిజం నీవన్నది - శ్రీ శ్రీ

అవును నిజం అవును నిజం అవును నిజం నీవన్నది..
నీవన్నది నీవన్నది నీవన్నది, నిజం నిజం…

లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం జగత్తులో..
బ్రతుకు వృధా చదువు వృధా కవిత వృధా, వృధా వృధా…

మనమంతా బానిసలం గానుగులం పీనుగులం..
వెనుక దగా ముందు దగా, కుడి ఎడమల దగా దగా…

మనదీ ఒక బ్రతుకేనా కుక్కల వలె నక్కల వలె..
మనదీ ఒక బ్రతుకేనా సందులలో పందుల వలె…

నిజం సుమీ నిజం సుమీ, నీవన్నది నిజం సుమీ..
బ్రతుకు చాయ చదువు మాయ, కవిత కరక్కాయ సుమీ…

లేదు సుఖం లేదు సుఖం చెడు విషం జీవి ఫలం..
జీవి ఫలం చెడు విషం చెడు విషం చెడు విషం…

అవును నిజం అవును సుమా అవును నిజం నీవన్నది..
నీవన్నది నీవన్నది నీవన్నది, నిజం నిజం…

– శ్రీ శ్రీ మహాప్రస్థానం నుండి..

బతుకమ్మ పాటలు – ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ..

17 జూలై

ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..

తంగేడు పువ్వప్పునే గౌరమ్మ.. తంగేడు కాయప్పునే గౌరమ్మ..

తంగేడు చెటుకింద ఆటసిలకలాల పాటసిలకలాల కలికిసిలకలాల

కందుమ్మగుట్టలు  రానువోనడుగులు తీరుద్దరాషలు తారుగోరంటలు..

గనమైన పున్నపూవే గౌరమ్మ.. గజ్జెలా వడ్డాలమే గౌరమ్మ..

ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..

గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ.. గుమ్మాడి కాయప్పునే గౌరమ్మ..

గుమ్మాడి చెటుకింద ఆటసిలకలాల పాటసిలకలాల కలికిసిలకలాల

కందుమ్మగుట్టలు  రానువోనడుగులు తీరుద్దరాషలు తారుగోరంటలు..

గనమైన పున్నపూవే గౌరమ్మ.. గజ్జెలా వడ్డాలమే గౌరమ్మ..

ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..

రుద్రాశ పువ్వప్పునే గౌరమ్మ.. రుద్రాశ కాయప్పునే గౌరమ్మ..

రుద్రాశ చెటుకింద ఆటసిలకలాల పాటసిలకలాల కలికిసిలకలాల

కందుమ్మగుట్టలు  రానువోనడుగులు తీరుద్దరాషలు తారుగోరంటలు..

గనమైన పున్నపూవే గౌరమ్మ.. గజ్జెలా వడ్డాలమే గౌరమ్మ..

ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..

కాకరా పువ్వప్పునే గౌరమ్మ.. కాకరా కాయప్పునే గౌరమ్మ..

కాకరా చెటుకింద ఆటసిలకలాల పాటసిలకలాల కలికిసిలకలాల

కందుమ్మగుట్టలు  రానువోనడుగులు తీరుద్దరాషలు తారుగోరంటలు..

గనమైన పున్నపూవే గౌరమ్మ.. గజ్జెలా వడ్డాలమే గౌరమ్మ..

ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..

చామంతి పువ్వప్పునే గౌరమ్మ.. చామంతి కాయప్పునే గౌరమ్మ..

చామంతి చెటుకింద ఆటసిలకలాల పాటసిలకలాల కలికిసిలకలాల

కందుమ్మగుట్టలు  రానువోనడుగులు తీరుద్దరాషలు తారుగోరంటలు..

గనమైన పున్నపూవే గౌరమ్మ.. గజ్జెలా వడ్డాలమే గౌరమ్మ..

ఆపూలు తెప్పించి పూవాన వూదించి..

గంధంల కడిగించి .. కుంకుమలా జాడిచ్చి..

పసుపు గౌరమ్మతో..

నీనోము నీకిత్తుమే గౌరమ్మ.. మా నోము మాకీయవే గౌరమ్మ..

నీనోము నీకిత్తుమే గౌరమ్మ.. మా నోము మాకీయవే గౌరమ్మ..

ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ..

తంగేడు పువ్వప్పునే గౌరమ్మ.. తంగేడు కాయప్పునే గౌరమ్మ..

తంగేడు చెటుకింద ఆటసిలకలాల పాటసిలకలాల కలికిసిలకలాల

కందుమ్మగుట్టలు  రానువోనడుగులు తీరుద్దరాషలు తారుగోరంటలు..

గనమైన పున్నపూవే గౌరమ్మ.. గజ్జెలా వడ్డాలమే గౌరమ్మ..

బతుకమ్మ పాటలు – ఒక్కేసి పువ్వేసి సందమామ

17 జూలై

ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఒక్కజాములాయే సందమామ…

శివుడచ్చె యాల్లాయె సందమామ.. శివుడు రాకపాయె సందమామ…

శివుడికి శ్రీగద్దె సందమామ.. మాకు సారగద్దె సందమామ…

రెండేసి పూలేసి సందమామ.. రెండుజాములాయే సందమామ…

శివుపూజ యాల్లాయె సందమామ.. శివుడు రాకపాయె సందమామ…

మూడేసి పూలేసి సందమామ.. మూడుజాములాయే సందమామ…

శివుడింక రాడాయే సందమామ.. శివుడి పూజలాయె సందమామ…

గోరంట సెట్లల్ల సందమామ.. గోడపెట్టబాయె సందమామ…

నాల్గేసి పూలేసి సందమామ.. నాల్గుజాములాయే సందమామ…

శివుపూజలాల్లాయె సందమామ.. శివుడు రాకపాయె సందమామ…

రుద్రాక్ష వనముల సందమామ.. నిద్రించపాయె సందమామ…

ఐదేసి పూలేసి సందమామ.. ఐదుజాములాయే సందమామ…

శివుడింక రాడాయే సందమామ.. శివుడి పూజలాయె సందమామ…

బంతి వనములోన సందమామ.. బంతులాడపాయె సందమామ…

ఆరేసి పూలేసి సందమామ.. ఆరుజాములాయే సందమామ…

శివుపూజలాల్లాయె సందమామ.. శివుడు రాకపాయె సందమామ…

మల్లె వనములోన సందమామ.. మాటలాడపాయె సందమామ…

ఏడేసి పూలేసి సందమామ.. ఏడుజాములాయే సందమామ…

రత్నాలగౌరు సందమామ.. నీరాశికలుపుల్లు సందమామ…

ఎనిమిదో పువ్వేసి సందమామ.. ఎన్మిది జాములాయే సందమామ…

తీగెతీగెలబిందె సందమామ.. రాగితీగెలబందె సందమామ…

తొమ్మిదో పువ్వేసి సందమామ.. తొమ్మిది జాములాయే సందమామ…

రాశివడబోసి సందమామ.. రాశికలుపరావె సందమామ…

పదేసి పులేసి సందమామ.. పది జాములాయే సందమామ…

తీగెతీగెలబిందె సందమామ.. రాగితీగెలబందె సందమామ…

శివుపూజ యాల్లాయె సందమామ.. శివుడు రాకపాయె సందమామ…

శివుడికి శ్రీగద్దె సందమామ.. మాకు సారగద్దె సందమామ…

శివుడికి శ్రీగద్దె సందమామ.. మాకు సారగద్దె సందమామ…

Justin Bieber – బేబి, బేబి, బేబి, ఓ …. (Baby Baby Baby Oh…)

23 ఆగ

యు నొ యు లవ్ మి, ఐ నొ యు కేర్
జస్ట్ షౌట్ వెనెవర్, అండ్ ఐవిల్ బి దేర్
యు ఆర్ మై లవ్, యు ఆర్ మై హర్ట్
అండ్ వి విల్ నెవర్, ఎవర్, ఎవర్ బి అపార్ట్

ఆర్ వి ఎన్ ఐటెం? గర్ల్, క్విట్ ప్లేయింగ్
“వి ఆర్ జుస్ట్ ఫ్రెండ్స్,” వాట్ ఆర్ యు సేయింగ్?
సెయిడ్ “దేర్స్ అనదర్,” అండ్ లుకుడ్ రైట్ ఇన్ మై ఐస్
మై ఫస్ట్ లవ్ బ్రోక్ మై హర్ట్ ఫర్ ద ఫస్ట్ టైం

అండ్ ఐ వాస్ లైక్ బేబి, బేబి, బేబి, ఓ
లైక్ బేబి, బేబి, బేబి, నొ
లైక్ బేబి, బేబి, బేబి, ఓ
ఐ తాట్ యు వుడ్ ఆల్వేస్ బి మైన్, మైన్

బేబి, బేబి, బేబి, ఓ
లైక్ బేబి, బేబి, బేబి, నొ
లైక్ బేబి, బేబి, బేబి, ఓ
ఐ తాట్ యు వుడ్ ఆల్వేస్ బి మైన్, మైన్

ఫర్ యు, ఐ వుడ్ హావ్ డన్ వాటెవర్
అండ్ ఐ జస్ట్ కంట్ బిలీవ్ వి అర్ హియర్ టుగెదర్
అండ్ ఐ వాన్న ప్లె ఇట్ కూల్, బట్ ఐం లూసిన్ యు
ఐవిల్ బయ్ యు ఎనితింగ్, ఐవిల్ బయ్ యు ఎని రింగ్

అండ్ ఐం ఇన్ పీసెస్, బేబి ఫీక్స్ మీ
అండ్ జస్ట్ షెక్ మి టిల్ యు వేక్ మి ఫ్రం దిస్ బాడ్ డ్రీం
ఐం గోయింగ్ డౌన్, డౌన్, డౌన్, డౌన్
అండ్ ఐ జస్ట్ కంట్ బిలీవ్ మై ఫస్ట్ లవ్ వోంట్ బి ఎరౌండ్

అండ్ ఐం లైక్ బేబి, బేబి, బేబి, ఓ
లైక్ బేబి, బేబి, బేబి, నొ
లైక్ బేబి, బేబి, బేబి, ఓ
ఐ తాట్ యు వుడ్ ఆల్వేస్ బి మైన్, మైన్

బేబి, బేబి, బేబి, ఒహ్
లైక్ బేబి, బేబి, బేబి, నొ
లైక్ బేబి, బేబి, బేబి, ఒహ్
ఐ తాట్ యు వుడ్ ఆల్వేస్ బి మైన్, మైన్

వెన్ ఐ వాస్ 13, ఐ హడ్ మై ఫస్ట్ లవ్
దేర్ వస్ నొబడి దట్ కంపేర్డ్ టు మై బేబి
అండ్ నొబడి కేం బిట్వీన్ అస్ హు కుడ్ ఎవర్ కం ఎబొవ్
షి హాడ్ మి గొయింగ్ క్రేజి, ఓ ఐ వస్ స్టార్స్ట్రక్
షి వోక్ మి అప్ డైలి, డొంట్ నీడ్ నొ స్టార్బక్స్

షి మేడ్ మై హర్ట్ పౌండ్
ఐ స్కిప్ ఎ బీట్ వెన్ ఐ సీ హర్ ఇన్ ద స్ట్రీట్
అండ్ ఎట్ స్చ్కూల్ ఆన్ ద ప్లేగ్రౌండ్
బట్ ఐ రియల్లి వాన్న సీ హర్ ఆన్ ఎ వీకెండ్
షి నొ షి గాట్ మి డెజిన్ కాస్ షి వాస్ సో అమెజింగ్
అండ్ నౌ మై హర్ట్ ఈస్ బ్రెకిన్ బట్ ఐ జస్ట్ కీప్ ఆన్ సెయింగ్

బేబి, బేబి, బేబి, ఓ
లైక్ బేబి, బేబి, బేబి, నొ
లైక్ బేబి, బేబి, బేబి, ఓ
ఐ తాట్ యు వుడ్ ఆల్వేస్ బి మైన్, మైన్

బేబి, బేబి, బేబి, ఓ
లైక్ బేబి, బేబి, బేబి, నొ
లైక్ బేబి, బేబి, బేబి, ఓ
ఐ తాట్ యు వుడ్ ఆల్వేస్ బి మైన్, మైన్

ఐం ఆల్ గోన్
(యే, యే, యే)
(యే, యే, యే)
నౌ ఐం ఆల్ గోన్
(యే, యే, యే)
(యే, యే, యే)
నౌ ఐం ఆల్ గోన్
(యే, యే, యే)
(యే, యే, యే)
నౌ ఐం ఆల్ గోన్, గోన్, గోన్, గోన్
ఐం గోన్

<br>

Click here For English Lyrics

<br>

ఎల్లియెల్లాయి రాయే ఎల్లమ్మ మా కన్న తల్లి రాయే ఎల్లమ్మ… (Yellama talli song remix by Raju)

29 జూలై

ఎల్లియెల్లాయి రాయే ఎల్లమ్మ మా కన్న తల్లి రాయే ఎల్లమ్మ…
బంగారు కుండవరమూ ఎల్లమ్మ బైలెల్లి రావమ్మ ఎల్లమ్మ…
ఎటెల్లిపోదూ అని ఎల్లమ్మ బోనలను చేత్తుర్రే మాతల్లి …
ఎల్లో…. మా తల్లి…
ఎల్లియెల్లాయి రాయే ఎల్లమ్మ మా కన్న తల్లి రాయే ఎల్లమ్మ…

తీగవారె తీగవారె అమ్మ రేణుక మాయి రేణుక.. ఏమేమి తీగవారే అమ్మ రేణుకో మాయి రేణుక..
నీ బోనాల పండుగచ్చె అమ్మ రేణుక మాయి రేణుక.. మా పల్లంత తీగవారే అమ్మ రేణుకో మాయి రేణుక..
అబ్బబ్బ మాతల్లి ఎల్లమ్మ రాయే… ఎల్లమ్మ రాయే… ఎల్లమ్మ నీకు మా బోనాలతోని… గానాలతోని..
డమడామ డప్పుల్ల సప్పుల్లతోని.. గిన్నల్లతోని.. నీ ముందుకొచ్చినాము మాటాడు తల్లి, మందలిచ్చు తల్లి.
ఎల్లో…. మా తల్లి…
డమడామ డప్పుల్ల సప్పుల్లతోని.. గిన్నల్లతోని.. నీ ముందుకొచ్చినాము మాటాడు తల్లి, మందలిచ్చు తల్లి.

సక్కాని చిలకలంటా ఎల్లమ్మ, సన్నాని రైకలంటా ఎల్లమ్మ.. సక్కాని చిలకలంటా ఎల్లమ్మ, సన్నాని రైకలంటా ఎల్లమ్మ..
తెల్లచీర జారికోంగూ.. ఎల్లమ్మ .. కొప్పూవంపులాయే…
పాలకొబ్బరి కాయలు ఎల్లమ్మ… పసుపు గంధాలు తెత్తిమి.. మాతల్లి..
పదిఫీట్ల పట్టు పరిసీ… ఎల్లమ్మ.. పట్నం ను కొట్టినామూ ఎల్లమ్మ…
రావమ్మ రావమ్మా ఎల్లమ్మ … పట్టుమీదికీ రావూ మాతల్లి ..
నీకు చేసేటి పూజలన్నీ… ఎల్లమ్మా, నీకు జేయ వచ్చినామూ ఎల్లమ్మ..
నీ కాలిగజ్జె గల్లుమంటే అమ్మ రేణుకో మాయి రేణుక.. మా కరీంనగర్ దద్దరిల్లే అమ్మ రేణుకో మాయి రేణుక.

నడింబాగ పట్టినావు అమ్మ రేణుకో మాయి రేణుక.. నువ్వు నడికట్లు కట్టినావు అమ్మ రేణుకో మాయి రేణుక..
చీరికూత పట్టినావు అమ్మ రేణుకో మాయి రేణుక.. నువ్వు జడకొప్పులల్లినావ అమ్మ రేణుకో మాయి రేణుక..
నీకు సిప్పలాంత కల్లంత అమ్మ రేణుకో మాయి రేణుక.. నీకు బుంగలల్ల తెచ్చినాము అమ్మ రేణుకో మాయి రేణుక..
కోడిపుంజు గొర్లన్నీ అమ్మ రేణుకో మాయి రేణుక.. అరె కొట్టుకోంగ కోసినాము అమ్మ రేణుకో మాయి రేణుక.
తల్లి… రేణుక ఎల్లమ్మ..
కోడిపుంజు గొర్లన్నీ అమ్మ రేణుకో మాయి రేణుక.. అరె కొట్టుకోంగ కోసినాము అమ్మ రేణుకో మాయి రేణుక.

మా పిల్లజెల్ల సల్లగుంచు అమ్మ రేణుక మాయి రేణుక…మా గొడ్డుగోద సల్లగుంచు అమ్మ రేణుకో మాయి రేణుక..
పాడిపంట మంచిదీ అమ్మ రేణుక మాయి రేణుక…మా పల్లెనంత కాపాడు అమ్మ రేణుకో మాయి రేణుక..
మల్లచ్చె గీ దినము అమ్మ రేణుక మాయి రేణుక.. మరవకుండ కొల్తాము అమ్మ రేణుకో మాయి రేణుక..

ఎల్లమ్మ తల్లీ ఏరెవ్వరే ఏరెవ్వరే… మా తల్లీ ఎల్లమ్మ నీకు ఎదురెవ్వరే ఎదురెవ్వరే ఎదురెవ్వరే..
ఎల్లమ్మ తల్లీ నీకు ఏరెవ్వరే ఏరెవ్వరే… మా తల్లీ ఎల్లమ్మ నీకు ఎదురెవ్వరే ఎదురెవ్వరే..

Play This Song

Play This Song

నచ్చినావే నవ్వుల గోపెమ్మ… గుండెనిండా నీదే పాటమ్మ…

1 జూలై

సుం సుం సుమారియా.. సుం సుం సుం సుమారియా.. సుం సుం సుమారియా ఓహో…
సుం సుం సుమారియా.. సుం సుం సుం సుమారియా.. సుం సుం సుమారియా ఓహో…

నచ్చినావే నవ్వుల గోపెమ్మ… గుండెనిండా నీదే పాటమ్మ…

కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా…

నవ్వే వసంతమై.. నాలో ప్రశాంతమై.. ఉంటావా నువ్వాదేవుని వరమై…
పిలిచే సంగీతమై.. పలికే నాగీతమై.. కొలువుంటావా నువు నాలో సగమై…
నిన్నే చూడని ఆ రోజంతా దిగులే.. కదిలే కాలం నా కన్నీరై కరిగే…
ప్రేమా.. ప్రేమా అని పిలిచిందే నిన్నే మరి…

కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా…
కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా…

నచ్చినావే నవ్వుల గోపెమ్మ… గుండెనిండా నీదే పాటమ్మ…

గుడిలో దేవున్ని మొక్కి కొబ్బరి కాయను కొట్టి… నిన్నే క్షేమంగా చూడమంటున్నా…
కలలో నిన్నే చూసి.. గుండెని పువ్వుగ కోసి.. నీకే ఇవ్వాలని పరిగెడుతున్నా..
నీ అడుగులు మోసే మట్టిని ముద్దాడితే… యదలో నీ ఊహలు పున్నమిలా విరిసే…
నీప్రేమ వన్నెలలో నానీడ నిన్నే చూపే..

కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా…
కంటినిండా నువ్వేనమ్మ.. కళ్లుమూస్తే నువ్వేనమ్మ.. కలలోకె వస్తున్నావమ్మా…

నచ్చినావే నవ్వుల గోపెమ్మ… గుండెనిండా నీదే పాటమ్మ..

***************
సాహిత్యం: వరికుప్పల
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
గానం: ఉదిత్ నారాయణ్
చిత్రం: వరం
***************

Nachinave Navvula Gopemma from Varam

Play This Song

పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో…

26 జూన్

పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో
పాడే కోయిల పాటలోన ఆ పాట మదురిమ ఎక్కడిదో…
వెదురు ముక్కలో దాగిఉన్న ఆ వేలరాగములో ఎవరివో
నెమలిపించములు అద్దుకున్న హరి విల్లురంగులూ ఎక్కడివో..
పంచభూతములు కన్న వింతల ప్రకృతి తత్వము పాడవె మనసా..
పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో
పాడే కోయిల పాటలోన ఆ పాట మదురిమ ఎక్కడిదో…

ప్రాణికోటిలో ప్రణవగీతమై పల్లవించునది ఎవ్వరో
పండుతున్న ప్రతి విత్తనానికి పాలు తాపినది ఎవ్వరో..
నేలకి నింగికి నిచ్చనలేసే నీటిదారలు ఎక్కడివో
నీటిలోన జీవించే ప్రాణులను నిదురపుచ్చునది ఎవ్వరో..

చూడముచ్చట సృష్టి విలాసము ఎంత పాడినా తనివి తీరునా…

పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో
పాడే కోయిల పాటలోన ఆ పాట మదురిమ ఎక్కడిదో…

ఉమ్మనీరులో ఊరే శిశువుకు ఊపిరులూదేదెవ్వరో
పరిమళాలు వెదజల్లె కస్తూరి పండించునది ఎవ్వరో..
మిణుగురు మేనులొ మిలమిల మెరిసె మణిదీపాలు ఎక్కడివో
గంఠలోపల చిక్కుకున్న ఆ కంఠనాదము ఎవ్వరిదో..

అబ్బురపరిచే అధ్బుతాలతో అలరారే ఆ కాళగమనమున

పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో
పాడే కోయిల పాటలోన ఆ పాట మదురిమ ఎక్కడిదో…