నీలపూరి గాజుల ఓ నీలవేణి – మహాత్మ

అక్టోబర్ 22, 2009

చిత్రం: మహాత్మ
సంగీతం: విజయ్ ఆంటోని
గానం: కాసర్ల శ్యామ్ & గ్రూప్

కుక్కు… కుక్కు… కూ..ఉ..ఊ… కుక్కు..
కుక్కు… కుక్కు… కూ..ఉ..ఊ… కుక్కు….

పల్లవి 1:
నీలపూరి గాజుల ఓ నీలవేణి నిలుసుంటె క్రిష్ణవేణి..
నువ్ లంగా ఓణి వేసుకోని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి…

నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంసనడక నిన్నుచూడలేనె బాలిక..
నీ కళ్లు జూసీ నీ పళ్లు జూసి కలిగెనమ్మ ఏదొ కోరిక…
_____
పల్లవి 2:
నీలపూరి గాజుల ఓ నీలవేణి నిలుసుంటె క్రిష్ణవేణి..
నువ్ లంగా ఓణి వేసుకోని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి…

నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంసనడక నిన్నుచూడలేనె బాలిక..
నీ కళ్లు జూసీ నీ పళ్లు జూసి కలిగెనమ్మ ఏదొ కోరిక…
____
చరణం 1:
నల్ల నల్లాని నీ కురులు దువ్వి, తెల్ల తెల్లాని మల్లెలు తురిమి
చేమంతి పూలు పెట్టుకోని, నీ పెయ్యంత సెంటు పూసుకోని
ఒళ్లంత తిప్పుకుంటూ వయ్యారంగా పోతుఉంటే -
నిలువదాయే నా పానమే
____
పల్లవి 3:
నీలపూరి గాజుల ఓ నీలవేణి నిలుసుంటె క్రిష్ణవేణి..
నువ్ లంగా ఓణి వేసుకోని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి…

నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంసనడక నిన్నుచూడలేనె బాలిక..
నీ కళ్లు జూసీ నీ పళ్లు జూసి కలిగెనమ్మ ఏదొ కోరిక…
____
చరణం 2:
నీ చూపుల్లొ ఉంది మత్తుసూది.. నా గుండెల్లొ గుచ్చుకున్నాది
నీ మాటల్లొ తుపాకి తూట.. అబ్బ జారిపోయెనమ్మనీ పైట
నీ కొంగుచాటు అందాలు చూసి నేను ఆగమైతి -
ఒక్కసారి తిరిగి చూడవే…
____
పల్లవి 4:
నీలపూరి గాజుల ఓ నీలవేణి నిలుసుంటె క్రిష్ణవేణి..
నువ్ లంగా ఓణి వేసుకోని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి…

నడుము చూస్తే కందిరీగ నడక చూస్తే హంసనడక నిన్నుచూడలేనె బాలిక..
నీ కళ్లు జూసీ నీ పళ్లు జూసి కలిగెనమ్మ ఏదొ కోరిక…


జోడి – నను ప్రేమించానను మాట..

జనవరి 1, 2009

నను ప్రేమించానను మాట.. కలనైనా చెప్పెయ్ నేస్తం.. కలకాలం.. 
కలకా..లం బ్రతికేస్తా.. కలకాలం బ్రతికేస్తా....
నను ప్రేమించానను మాట కలనైనా చెప్పెయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా... (2)
పూవుల యదలో శబ్దం.. మన మనసులు చేసే యుద్ధం ఇక ఓపదె నా హృదయం...
ఇక ఓపదే.. నా హృదయం...
సత్యమసత్యములు పక్కపక్కనే .. ఉంటయ్ పక్కపక్కనే... చూపుకి రెండు ఒక్కటే
బొమ్మాబొరుసులు పక్కపక్కనే.. చూసే కళ్లు ఒక్కటే... అయినా రెండూ వేరేలే..
||నను ప్రేమించానను ||
రేయిని మలిచి...ఓ... రేయిని మలిచి, కనుపాపలుగా చేసావో.. 
కనుపాపలుగా చేసావో,చిలిపి వెన్నెలతో కన్నులు-చేశావో... 
మెరిసే చుక్కల్ని తెచ్చి వేళి గోళ్లుగ మలచి, మెరుపు తీగను తెచ్చి పాపిటగా మలిచావో
వేసవిగాలులు పీల్చి వికసించే పువ్వుని తెచ్చి.. మంచి గంధాలెన్నో పూసి మేనిని మలిచావో..
అయినా...మగువ, మనసుని శిలగా చేసినా..వే
వలచే... మగువ, మనసుని శిలగా చేసినా..వే...   ||నను ప్రేమించానను||
వయసుని తడిమి నిదురలేపింది నీవేగా.. నిదురలేపింది నీవేగా
వలపు మధురిమలు తెలిపిందినీవేగా..
ఓ..గాలి నేల నింగి ప్రేమ, ప్రేమించే మనసు వివరము తెలిపినదెవరు.. ఓ ప్రేమ నీవేగా
గంగై పొంగె మనసు కవితల్లె పాడుతు ఉంటే
తుంటరి జలపాతంలా-కమ్ముకున్నది నీవేగా..
అయినా.. చెలియ.. మనసుకి మాత్రం దూరమై..నా...వే
కరుణే.. లేక మనసుని మాత్రం వీడిపో..యా...వే... ||నను ప్రేమించానను||
ట్యాగ్: JODI - "Nanu Preminchananu Maata kalanaina cheppey nestam" LYRICS - Prashant, Simran - Singer Hariharan
Listen to it from: Raaga
View Song in JPEG Format: LYRICS SNAP SHOT


మనసు పలికె – స్వాతిముత్యం

నవంబరు 7, 2008

పల్లవి|

ఆ….ఆ…

మనసు పలికె… మనసు పలికె…మౌన గీతం… మౌన గీతం…

మనసు పలికె మౌన గీతం నీవే..

మమతలొలికే.. మమతలొలికే… స్వాతిముత్యం.. స్వాతిముత్యం…

మమతలొలికే స్వాతిముత్యం నీవే

అణువు అణువు ప్రణయ మధువు

అణువు అణువు ప్రణయ మధువు

తనువు సుమధనువు ఉ..ఉ..ఉ..ఉ   ||మనసు పలికె… ||

చరణం 1|

శిరసు పైని గంగనై మరుల జలకాలాడని

మరుల జలకాలాడని.. అ.అ.అ.

పదమునే అంగిర్థనై  పగలు రేయి వొదగని ..

పగలు రెయి వొదగని …

హ్రుదయ వేదనలో.. మధుర లాలనలొ…

హ్రుదయ వేదనలో.. మధుర లాలనలొ……

వెలిగిపోని.. రాగ దీపం..

వెలిగిపోని రాగ దీపం వెయి జన్మలుగా   ||మనసు పలికె… ||

చరణం 2|
కానరాని ప్రేమకే ఓనమాలు దిద్దని..ఓనమాలు దిద్దని…
పెదవిపై నీ ముద్దులై మొదటి తీపి అర్థనం.. మొదటి తీపి..
లలిత యామినిలో కలల కౌముదిలో
లలిత యామినిలో కలల కౌముదిలో
కరిగిపోనీ… కాలమంత…
కరిగిపోనీ… కాలమంత… కౌగిలింతలుగా… ||మనసు పలికె||

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుల్లు

ఫిబ్రవరి 15, 2008

ఘళ్లు ఘళ్లు ఘళ్లు మంటు మెరుపల్లే తుళ్లు
ఝళ్లు ఝళ్లు ఝళ్లున ఉప్పొంగు నింగి వల్లు
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు
నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు
పల్లవించనీ నెలకు పచ్చని పరవల్లు
ఘళ్లు ఘళ్లు ఘళ్లు మంటు మెరుపల్లే తుళ్లు
ఝళ్లు ఝళ్లు ఝళ్లున ఉప్పొంగు నింగి వళ్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవె ఎరుగని వెగంతో వెళ్లు

లయకే నిలయమై నీపాదం సాగాలి

అహహహ్హహహ…
మలయానిల గతిలొ సుమ బాలగ తూగాలి
వలలొ వొదుగునా విహరించె చిరుగాలి
సెలయెటికి నటనం నెర్పించే గురువెడి
తిరిగె కాలానికీ
ఆ ఆ ఆ… ఆ ఆ ఆ…
ఆ ఆ ఆ…. ఆ ఆ ఆ…..
తిరిగే కాలానికీ తీరొకటుంది
అది నీ పాఠానికి దొరకను అంది
నటరాజ స్వామి జటా జూటి లోకిచెరకుంటె
విరుచుకుపడు సురగంగకు విలువేముంది
విలువేముందీ

                                         || ఘళ్లు ||

దూకే అలలకూ ఏ తాళం వేస్తారు
ఆహహహ్హహహ
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్ధం
వద్దని ఆపలేరు
ఆ ఆ ఆ.. ఆ ఆ ఆ…
ఆ ఆ ఆ… ఆ ఆ ఆ…..
వద్దని ఆపలేరు ఉరికే ఊహని
హద్దులు దాటరాదు ఆశల వాహిని
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరి వనముల పరిమళముల విలువేముంది
విలువేముందీ

                                       || ఘళ్లు || 


తుర్‌ర్రట బాబా తుర్‌ర్‌ర్‌ర్రట బాబా..

జనవరి 8, 2008

తుర్‌ర్రట బాబా తుర్‌ర్‌ర్‌ర్రట బాబా..అదిరిపోయే మెహబూబ..ఓరోరి సాంబ దిశమొల సాంబనెత్తిన మోగే జలపంబ
నా పాట… ఈ పూట… కాశీ గంగలా చెలరేగా…
ఆకాశం తాకేలా… పదాలే పొంగగా అలలు అలలుగా… (తుర్‌ర్రట బాబా – జలపంబ)

చ1|| వన్ – చదివింది అంత గుర్తుండేట్టు చెయ్యరా..
టూ – తెలిసున్న ప్రశ్నలన్ని నువ్వే ఇవ్వరా..
త్రి – పథకాలతోటి పాసయ్యేట్టు చూడరా..
హోయ్ – గుర్తుంచుకోరా
ఈ చెరువంత తెచ్చి నెత్తిమీద పోస్తారా..
పై శివరాత్రి నాడు జాగారాలు చేస్తారా..
ఫుల్ పులిహోరా చిట్టి గారెలెన్నో ఇస్తారా
నీ చేయూతనీరా..

ఎంత కష్టం పడేందుకైనా వెంట నేనూ ఉంటారా..
పాపకోరే వరాలు ఇచ్చి.. నీకేమీ కావాలన్నా.. చేయాలన్నా నన్నే అడగాలా..  (తుర్‌ర్రట బాబా – జలపంబ)

చ2|| ఈ గుడి గోపురాన పావురాయి నేనురా..
నా శనివాడు ఆడకట్టులోనే లేడురా..
ఏ పని ఐనా నాకు లెఖ్ఖలోకే కాదురా..
నే ఢీ.. ఢీ అంటే ఢీ రా..
ఆ గుడిమీది బొమ్మలన్ని తాళమెయ్యగా,
మా గుడిలోని రావిచెట్టు తలని ఊపగా,
శ్రీ నటరాజే వచ్చి నాతో దోస్తీ చెయ్యడా,
ఢీ.. దినకు దీరా..

నిప్పులాగా నిజాయితీగా నెగ్గుతారా ఎపుడైనా,
విష్ణు చక్రం విధానమెనే- జే జేలనందుకుంటూ దూసుకుంటు సాగుతానురా…

చిత్రం : కృష్ణార్జున
సంగీతం : యం.యం. కీరవాణి
గానం : టిప్పు


అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా ?

సెప్టెంబరు 15, 2007

పల్లవి : అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా..స్వర్ణోచ్చవాలు చేద్దామా…
ఆత్మవినాశపు అరాజకాన్నే స్వరాజ్యమందామా… దానికి సలాము చేద్దామా…
శాంతికపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం..
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా….. ఓ పవిత్ర భారతమా !
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.. స్వర్ణోచ్చవాలు చేద్దామా…
నిత్యం కొట్టుకుచచ్చే జనాల శ్వేచ్చను చూద్దామా.. దాన్నే స్వరాజ్యమందామా…

ఛరణం 1: కులాలకోసం గుంపులు కడుతూ..మతాలకోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకు లేస్తారే ..జనాలు తలలర్పిస్తారే..
సమూహక్షేమం పట్టని స్వార్ధపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే ?…తెలిసీ భుజం కలిపి రారే ?
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి…పోరి ఏమిటి సాధించాలి…
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ..ఈ చిచ్చుల సిధూరం…
జవాబు చెప్పే భాధ్యత మరచిన జనాల భారతమా..! ఓ ..రణాల భారతమా..!!

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.. స్వర్ణోచ్చవాలు చేద్దామా…
ఆత్మవినాశపు అరాజకాన్నే స్వరాజ్యమందామా..దానికి సలాము చేద్దామా…

ఛరణం 2:  అన్యాయన్ని సహించని శౌర్యం, దౌర్జన్యాన్ని దహించే ధైర్యం,
కారడవులలో కౄరమృగంలా దాక్కొని ఉండాలా.. వెలుగుని తప్పుకు తిరగాలా ?
శత్రువుతో పోరాడే సైన్యం, శాంతిని కాపాడే కర్తవ్యం,
స్వజాతివీరులననచే విధిలో కవాతు చెయ్యాలా… అన్నల చేతిలొ చావాలా ?
తనలో దైర్యం అడవికి ఇచ్చి…. తన ధర్మం చట్టానికి ఇచ్చి…
ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే….
నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మంధారం…
ఈ సత్యా సింధూరం… వేకువవైపా చీకటిలోకా ఎటు నడిపేరమ్మా !…
గతి తోచని భారతమా….!!

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.. స్వర్ణోచ్చవాలు చేద్దామా…
యుద్ధనినాదపు అరాజకాన్నే స్వరాజ్యమందామా..దానికి సలాము చేద్దామా…

ఛరణం 3: తనతలరాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని, తనలో నీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకొని, ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని, కళ్లు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుదంట…. ఆవేశం!
ఆ హక్కేదో తనకే ఉందని శాశిస్తుందట … అధికారం !!
కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం…. చితి మంటల సింధూరం…
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా…! ఓ.. విషాద బారతమా…!!

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.. స్వర్ణోచ్చవాలు చేద్దామా…
ఆత్మవినాశపు అరాజకాన్నే స్వరాజ్యమందామా..దానికి సలాము చేద్దామా…
శాంతికపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం..
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా….. ఓ పవిత్ర భారతమా….
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా.. స్వర్ణోచ్చవాలు చేద్దామా…
నిత్యం కొట్టుకుచచ్చే జనాల శ్వేచ్చను చూద్దామా…
దాన్నే స్వరాజ్యమందామా……..!!!

విశిష్టత     : 1997 ‘నంది’  అవార్డ్ విజేత
సాహిత్యం   : సిరివెన్నెల సీతారామశాస్త్రి
చిత్రం       : సింధూరం (Sindhuram)
స్వరకల్పన : శ్రీ (sri)
గానం       : ‘గానగంధర్వ’ ఎస్.పి.బాలు (S.P.Balu)

పాట వినాలనుకుంటే :
Allindiansite.com
Ragalahari.com


పాడవోయి భారతీయుడా

ఆగష్టు 18, 2007

                       Flag following 

పాడవోయి భారతీయుడా.. ఆడిపాడవోయి విజయగీతికా

నేడే స్వాతంత్ర్యదినం.. వీరుల త్యాగఫలం..

నేడే నవోదయం నీదే ఆనందం..

స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి..

సాధించినదానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే సరిపోదోయి.

ఆగకోయి భారతీయుడా కదిలి సాగవోయి ప్రగతిదారులా..

ఆకాశమందుకునే ధరలొకవైపు.. అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ..

అవినీతి బంధుప్రీతి, స్త్రీ బతుకు( చీకటి) బజారూ.. అలముకున్న

ఈ దేశమెటు దిగజారూ.. కాంచవోయి నేటి దిస్థితి..

ఎదిరించవోయి ఈ పరీస్థితి..

పదవీవ్యామోహాలూ కులమతభేదాలూ.. భాషాద్వేషాలూ చెలరేగే నేడూ.. ప్రతిమినిషీ మరియొకని దోచుకునేవాడే.. తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే..

స్వార్థమే అనర్థకారణం..అది చంపుకొనుటే క్షేమదాయకం..

సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం.. సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం.. ఏకదీక్షతో గమ్యం చేరిననాడే.. లోకానికి మన భారతదేశం అందించునులే శుభసంకేతం..

                                             (చేతన సహకారంతో…………)


అద్దంటె యెమ్ముల్లాడ !

ఆగష్టు 17, 2007

[పల్లవి] అద్దంటె యెములవాడ పోతాను అంటవే-
పొల్లగాని గుండాడ గీకిత్తనంటవే ||అద్దంటె||

పొంగ రాంగ ఎక్క దిగ మూట ముల్ల పైలమే ||2||

కరీంనగరు జిల్ల జర్ర ఉశ్శారుగున్నదే !

మాట్ట పైలమే అవ్వా నీ మూట్ట పైలమే అవ్వా -
పొల్లా పైలమే అవ్వా, పొల్లగాడు పైలమే అవ్వా !!

[ఛరణం ౧(1)] ఎక్కంగపెద్దనోటు కండక్టరయ్యకిస్తె -

చీటిమీద గీతగీసి మడిసి మల్ల ఇత్తడే…! ||2||

దిగిపోంగ యాదిజెయ్యడే అవ్వా……!!

                                               ||అద్దంటె||

[ఛరణం ౨(2)] పొల్లగాని గుండు మీద సుండున్నదే,

సుండు మీద రెండు మూడు పుల్లున్నయే…

కత్తివట్టి గీకుతుంటె ఖయ్ ఖయ్ మంటడే… ||2||

మెల్లంగ గీకుతుంటె నోరుమూసుకుంటడే…! ||మాట్ట||


ఒకడే ఒక్కడు మొనగాడు – ముత్తు

ఆగష్టు 5, 2007

ఒకడే ఒక్కడు మొనగాడు ఊరేమెచ్చిన పనివాడు
విదికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు
భూమిని చీల్చే ఆయుధమేరా పూవుల కోసం కొడవల్లేల
మోసం ద్వేషం మరచిననాడు ఆనందాలే విరియును చూడు
  ||ఒకడే ఒక్కడు||
సయ్య సయ్యర సయ్యర సయ్య… హె..హె…ఎ. ఎ
సయ్య సయ్యర సయ్యర సయ్య ||2||
సయ్య సయ్యర సయ్యర సయ్యా…ఆ………..

మట్టి మీద మనిషికి ఆశ మనిషి మీద మట్టికి ఆశ ||2||
మన్నే చివరికి గెలిచేది అది మరణం కోరే తెలిసేది
కష్టం చేసి కాలు దహిస్తే నీవే దానికి యజమాని
కోట్లు పెరిగి కుమ్మరిస్తే డబ్బే నీకు యజమాని
జీవిత సత్యం మరవకురా జీవితమే ఒక స్వప్నమురా
  ||ఒకడే ఒక్కడు||

వాన మనది ప్రకృతి మనది తన పర భేదం ఎందుకు వినరా ||2||
కాలచక్రం నిలవదురా ఈ నేల స్వార్ధం ఎరగదురా
పచ్చని చెట్టు పాడే పక్షి ఇరులు జరులు ఎవ్వరివి
మంచిని మెచ్చే గుణమే ఉంటే ముల్లోకాలు అందరివి
జీవితమంటే పోరాటం అది మనసుకి తీరని ఆరాటం
  ||ఒకడే ఒక్కడు||

తమిళం లో లిరిక్స్ కొరకు…(For Tamil Version of this song)…


OKKADU – ఒక్కడు

జులై 31, 2007

పల్లవి:   సాహసం శ్వాసగా సాగిపో సోదరా !
            
సాగరం ఈదడం తేలికేం కాదురా !!


1:      కాలానికే తెలియాలిగా ముందున్న మలుపెమిటో -
            
పోరాటామే తేల్చాలిగా  రానున్న గెలుపెమిటో..
            
 ఒక్కడు నీ సైన్యమై తోడుంటె చాలు….

            సాహసం శ్వాసగా సాగిపో సోదరా !
            
సాగరం ఈదడం తేలికేం కాదురా !!


2:       కొవెలో చేరాలని కలగన్న పూబాలకి -
            
సుడిగాలిలో సావాసమై దొరికింది  పల్లకి.. 
            
 ఒక్కడు నీ సైన్యమై తోడుంటె చాలు…. 

            సాహసం శ్వాసగా సాగిపో సోదరా !
            
సాగరం ఈదటం తేలికేం కాదురా !!


Follow

Get every new post delivered to your Inbox.